భారతదేశం, డిసెంబర్ 13 -- గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఈ తేదీలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 2027 సంవత్సరానికి వచ్చే గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగేలా నిర్ణయించింది. మొత్తం 12 రోజులపాటు ఈ పుష్కరాలు ఉంటాయని పేర్కొంది.

చాలా రోజుల తేదీల ఖరారపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ వచ్చింది. అయితే చివరగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తాన సిధ్ధాంతి శ్రీ థంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన అభిప్రాయం కీలకంగా నిలిచింది. పుష్కరాల ప్రవేశ-ప్రస్థాన ఘడియలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఆయన చేసిన జ్యోతిష్య విశ్లేషణను ఎండోవ్మెంట్స్ కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. తేదీలను ఖరారు చేసింది.

గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగు మహోత్సవం. బృహస్పతి గ్రహ...