భారతదేశం, జనవరి 24 -- కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున...పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు.

గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటి అంచనాల నేపథ్యంలో అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు. సచివాలయంలో శుక్రవారం గోదావరి పుష్కర పనులపై తొలిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి. పుష్కర ఏర్పాట్ల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కర...