భారతదేశం, నవంబర్ 7 -- గోదావరి జిల్లాల ప్రజలకు గుడ్ న్యూస్. ఇకపై వందే భారత్ ట్రైన్ సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది.

కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి (నర్సాపురం ఎంపీ) భూపతిరాజు ​శ్రీనివాస వర్మ చాలా రోజులుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం పట్టుబడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా హామీనిచ్చారు. నర్సాపురానికి వందే భారత్ ట్రైన్ తీసుకువస్తాని చెప్పారు. ఆ తర్వాత నర్సాపురం నుంచి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.. పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. సర్వీస్ పొడిగింపుపై కసరత్తు పూర్తి చేసిన రైల్వేశాఖ అధికారులు. తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....