భారతదేశం, డిసెంబర్ 3 -- తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు సీఎం. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారన్నారు. జగన్ ప్రభుత్వం పశువులకు దాణా కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీ అక్రమాలకు అరికట్టేందుకు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌తో కూటమితో ఎన్నికలకు వెళ్లామన్నారు.

'ముందుగా రైతుల సమస్యలు పరిష్కారించాలని అనుకున్నాం. దాని తర్వాత మిగతా సమస్యల మీద దృష్టి సారించాం. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. వ్యవసాయం ద్వారా రాష్ట్రానికి ఆరు శాతం ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో ఖర్చులు ఎక్కువ. ఆదాయం తక్కువ. వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి....