భారతదేశం, మే 26 -- అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. శేరుల్లంకలో ఓ పెళ్లికి వచ్చిన యువకులు 11 మంది స్నానం కోసం గోదావరిలో దిగారు. లోతు అంచనా వేయలేకపోవడంతో 8 మంది గల్లంతయ్యారు. ముగ్గురు బయటపడ్డారు.

గోదావరిలో గల్లంతైన వారు కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్‌, సాయి, సతీష్‌, మహేశ్‌, రాజేశ్‌, రోహిత్‌, మహేశ్‌గా తెలుస్తోంది. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కమినిలంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతైన ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చేపట్టి, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

యువక...