Telangana,andhrapradesh, జూలై 26 -- ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం, కూనవరం, ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ఉద్ధృతంగా సాగుతోంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 32.2 అడుగులకు చేరింది. కూనవరం వద్ద నీటిమట్టం 12. 26 మీటర్లు, పోలవరం వద్ద 8.19 మీటర్లుగా ఉంది. ఇక ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

వరద పెరుగుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లంకగ్రామాలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు తుంగభద్ర నది వ...