భారతదేశం, ఆగస్టు 30 -- భారీ వర్షాల నేపథ్యంలో మళ్లీ గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారంతో పోల్చితే. ఇవాళ వరద ప్రవాహం ఎక్కువగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగుల నీటిమట్టం ఉంది. కూనవరం వద్ద నీటిమట్టం 18.10 మీటర్లుగా ఉండగా. పోలవరం వద్ద 11.71 మీటర్లుగా ఉంది.

ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.99 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలిపింది. సహాయక చర్యలకు 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు వివరించింది.

మరోవైపు కృష్ణా నదిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో ...