Telangana,hyderabad, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయపతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందన్నారు.గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

2023 డిసెంబర్ 7న తాము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారుయ ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు పెద్దపీట వేశామన్న ఆయన. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద 20 నెలల్లో రూ. 6790 కోట్ల రూ...