Hyderabad,telangana, జూలై 30 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్ లో అవకతవకలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఓఎస్డీ జి.కల్యాణ్ తో పాటు ఈ కుంభకోణానికి పాల్పడిన లబ్ధిదారులు, మధ్యవర్తులకు సంబంధించిన ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు నమోదైన ఎఫ్ఐఆర్ ల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది.

ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ప్రకారం. కేవలం రూ.2.1 కోట్ల అక్రమాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే కాగ్ నివేదిక ఆధారంగా పరిశీలిస్తే. రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మార్చి-2021తో ముగిసిన కాలానికి కాగ్ ఆడిట...