Hyderabad, ఏప్రిల్ 24 -- రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి కథ అందించింది తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. త్వరలోనే సూర్యతో కలిసి అతడు తీసిన రెట్రో మూవీ రిలీజ్ కానుండగా.. గలాటా ప్లస్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అసలు తాను ఇచ్చిన స్టోరీతోపాటు మూవీ స్క్రీన్ ప్లే పూర్తిగా మారిపోయినట్లు వెల్లడించాడు.

నిజానికి గేమ్ ఛేంజర్ కోసం తాను డైరెక్టర్ శంకర్ కు ఇచ్చిన స్టోరీ ఆ తర్వాత ఎంతో మంది ఇతర రచయితలు రావడంతో మారిపోయినట్లు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పాడు. ఈ స్టోరీ గురించి కార్తీక్ ఏమన్నాడంటే.. "నేను స్టోరీ ఔట్ లైన్ చెప్పాను. వన్ లైనర్.

ఎంతో హుందాగా ఉండే ఓ ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడు అవుతాడని నేను శంకర్ కు చెప్పాను. నేను స్టోరీని శంకర్ సార్ కు ఇచ్చినప్పుడు దానిని ఎంత ఘనంగా తీస్తాడో అన్న ఆస...