Hyderabad, జూన్ 23 -- రామ్ చరణ్ లీడ్ రోల్లో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలుసు కదా. ఈ సినిమాపై తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించాడు. తమ్ముడు మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎం9 న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు ఆ సినిమాపై స్పందిస్తూ.. తాను తప్పు చేశానని అంగీకరించాడు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ మూవీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో జడ్జిమెంట్, ఫిల్మ్ మేకింగ్ లో ఎక్స్‌పీరియన్స్ అనే బ్రాండ్ ఉంది.. మీరు తీసే సినిమాలో మీకు తెలియకుండా ఏమీ జరగదంటారు.. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అలా ఎందుకు జరిగింది అని యాంకర్ ప్రశ్నించారు. దీనిపై దిల్ రాజు ఇలా స్పందించాడు.

"పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్లతో చేసినప్పుడు 100 శాతం ఆ సమస్య ఉంటుంది. దిల్ రాజుకే కాదు.. అందరికీ ఆ సమస్య ఉంటుంది. సిన...