భారతదేశం, ఆగస్టు 7 -- బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్, మనీ లాండరీంగ్ కేసు దర్యాప్తులో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ బుధవారం (ఆగస్టు 6) హైదరాబాద్లోని బషీర్బాగ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆన్ లైన్ బెట్టింగ్ తో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో అతనికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ తర్వాత విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కేవలం గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని, అది బెట్టింగ్ ప్లాట్ ఫామ్ కాదని పేర్కొన్నాడు.

''బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో నాకు సమన్లు జారీ చేశారు. భారత్ లో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అనే రెండు కేటగిరీలు ఉనన్నాయి. నేను ఏ23 అనే గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశానని స్పష్టంగా చెప్పా. బెట్టింగ్ యాప్ లకు, గేమింగ్ యాప్ లకు ఎలాంటి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధం. అవి రిజి...