Hyderabad, ఆగస్టు 15 -- రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అలియా భట్. అప్పుడప్పుడు హీరోయిన్స్ సహనం కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటి అలియా భట్ కూడా సహనం కోల్పోయి ఫొటోగ్రాఫర్లపై కోపంతో కసురుకుంది.

అలియా భట్ ఇటీవల తనను ఫోటో తీయడానికి ఓ ప్రైవేట్ ప్రాపర్టీలోకి ప్రవేశించిన పాపరాజీల (ఫొటోగ్రాఫర్లు)పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెమెరాకు చిక్కింది. పికిల్ బాల్ గేమ్ ఆడేందుకు అలియా భట్ వచ్చింది. ఈ క్రమంలోనే తన వెంట వచ్చిన ఫొటోగ్రాఫర్లు భవనం ఆవరణలోకి అడుగు పెట్టారు.

ఫోటోగ్రాఫర్ల పట్ల సహనం కోల్పోయిన అలియా తన కారు నుంచి దిగి పాపరాజీలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరింది. "ప్లీజ్ లోపలికి రావద్దు. ఇది మీ భవనం కాదు. దయచేసి గేట్ బయటకు వెళ్లండి" అని అసహనంతో అలియా భట్ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో...