భారతదేశం, మే 12 -- ఏపీ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తోన్న గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు రూ.150 పారితోషికం ఇస్తుండగా...దీనిని రూ.375కు పెంచింది. నెలకు అత్యధికంగా రూ.27000గా నిర్ణయించింది. తక్షణమే జీతాల పెంపు ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి గంటకు రూ.150 చొప్పున నెలకు రూ.10,000 వరకూ గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. గౌరవ వేతనాన్ని పెంచాలంటూ గత కొన్నేళ్లుగా గెస్ట్ లెక్చరర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంటకు రూ.375 వరకు, గరిష్ఠంగా నెలకు రూ.27,000 చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

పీజీ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక...