భారతదేశం, డిసెంబర్ 25 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో కచ్చితంగా టైటిల్ రేసులో ఉంటాడనుకున్న కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. అతను విజేతగా నిలుస్తాడని చాలా మంది భావించారు. కనీసం టాప్-2లో అయినా నిలుస్తాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతను నాలుగో ప్లేస్ లో హౌస్ నుంచి వెళ్లిపోవడం షాక్ కలిగించింది. ఇది అన్యాయమంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఇమ్ము ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలిచాడు. టాప్-5కు చేరిన ఇమ్ము నాలుగో స్థానంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఇమ్ముకు హోస్ట్ శివాజీ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. ఎంట‌ర్‌టైన‌ర్‌ ఆఫ్ ది సీజన్ 9 ఇమ్మాన్యుయేల్ అని గ్రాండ్ గా వెల్ కమ్ ఇచ్చాడు. లాఫింగ్ బుద్ధ బొమ్మతో కూడిన ట్రోఫీ అందించాడు.

బిగ్ బాస్ బజ్ ...