Hyderabad, ఏప్రిల్ 16 -- "గెలిస్తే ప్రపంచానికి నువ్వు పరిచయమవుతావ్. అదే ఓడిపోతే ప్రపంచం నీకు పరిచయమవుతుంది" ఇది ఒక సినిమా డైలాగ్. కానీ, రియల్ లైఫ్‌లో కూడా పనికొచ్చే మాట ఇది. అందరూ గెలుపు వెంట పరుగెడుతుంటారు. తృటిలో తప్పినా కూడా గెలవలేకపోయామని ఎంతో బాధపడిపోతుంటారు. కానీ, గెలుపు చేజారక వచ్చే ఓటమి విజయం కంటే గొప్పది. చాలా విలువైనది. ఓటమి రుచి చూసిన వాడికి ఇక దేని గురించి దిగులు ఉండదు. గెలుపు గురించి భయముండదు. అదేంటీ.. ఓడిపోతే ఎలా బాగుంటుందనే సందేహం కలుగుతుందా? అయితే రండి. అదెలాగో చూద్దాం.

"ఓటమి గొప్పది" అని అనడం ఎందుకంటే అది మన విజయానికి దారి చూపుతుంది. గెలుపుకు బాట వేస్తుంది. మానసికంగా సిద్ధం చేసి ఆల్రెడీ ఓడిన వాడికి మరోసారి ఓడినా తట్టుకునే ధైర్యం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాదు, ఓటమి వల్ల మన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్...