భారతదేశం, మే 14 -- చాలా మంది ఎదురుచూస్తున్న 'మరణమాస్' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సమీపించింది. మలయాళ స్టార్ బాసిల్ జోసెఫ్ నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఐదు వారాలకు ఓటీటీలోకి వస్తోంది. మరణమాస్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే..

మరణమాస్ సినిమా నేటి (మే 14) సాయంత్రం 5 గంటలకు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ముందుగా 15వ తేదీన తీసుకురానున్నట్టు సోనీ లివ్ వెల్లడించింది. అయితే, కొన్ని గంటల ముందుగా నేటి సాయంత్రమే స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

మరణమాస్ చిత్రానికి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. ఓ సీరియల్ కిల్లర్, చేయని నేరానికి పోలీసులకు చిక్కిన యూట్యూబర్ చుట్టూ ఈ చిత్రం ఉంట...