భారతదేశం, జనవరి 12 -- ఓటీటీలోకి డైరెక్ట్ తెలుగు మూవీ రాబోతుంది. అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించిన చీకటిలో మూవీ నేరుగా ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ ను సోమవారం (జనవరి 12) రిలీజ్ చేశారు మేకర్స్. సైకో కిల్లర్ స్టోరీతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. స్టోరీ ఆద్యంతం ఉత్కంఠతో సాగేలా కనిపిస్తోంది.

శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించిన అప్ కమింగ్ మూవీ చీకటిలో. నాలుగేళ్ల తర్వాత శోభిత చేస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది. అక్కినేని చైతన్యతో పెళ్లి తర్వాత ఆమె నుంచి రాబోతున్న మొదటి మూవీ కూడా ఇది. చీకటిలో మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. జనవరి 23, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్.

సైకో కిల్లర్ చుట్టూ సాగే సీరియల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చీకటి...