భారతదేశం, ఏప్రిల్ 25 -- ఓ వైపు ఐపీఎల్ ఊపేస్తోంది. మరోవైపు సమ్మర్ హాలీడేస్ లో తమ పిల్లలను స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ ల్లో చేర్చేందుకు పేరేంట్స్ రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను అలరించేందుకు అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ మూవీస్ పై కూడా ఓ లుక్కేయండి. క్రీడలంటే కేవలం శారీరక శ్రమ కోసం ఆడేవి మాత్రమే కాదు. స్పోర్ట్స్ వల్ల డిసిస్లేన్ వస్తుంది. స్ఫూర్తి కలుగుతోంది.

లీడర్ షిప్ క్వాలిటీస్ నేర్చుకోవచ్చు. టీమ్ స్పిరిట్ అలవడుతుంది. ఈ సినిమాల్లో కూడా ఇవన్నింటినీ చూపించారు. స్పోర్ట్స్ ఎలాంటి కిక్ ను ఇస్తాయో, ఎలాంటి ఎమోషన్స్ ను బయటపెడతాయో ఊహించలేం. మరి ఎందుకు ఆలస్యం.. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఉన్న ఈ స్పోర్ట్స్ మూవీస్ ను చూసేయండి.

అసాధ్యం అనుకున్నది అందితే కలిగే ఫీలింగ్ వేరే లెవెల్. 1983లో కపిల్ డెవిల్స్ అదే సాధించారు. దేశానికి ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప...