భారతదేశం, డిసెంబర్ 18 -- కృత్రిమ మేధ (AI) రంగంలో గూగుల్ మరో భారీ అడుగు వేసింది. తన సరికొత్త, అత్యంత వేగవంతమైన ఏఐ మోడల్ 'జెమిని 3 ఫ్లాష్' (Gemini 3 Flash) ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. విశేషమేమిటంటే, ఇప్పటి వరకు గూగుల్ అత్యుత్తమ మోడల్‌గా పేరుగాంచిన జెమిని 2.5 ప్రో కంటే ఇది మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని కంపెనీ వెల్లడించింది. తాజాగా విడుదలైన ఈ మోడల్ ఇప్పుడు జెమిని యాప్‌లో డిఫాల్ట్ (Default) మోడల్‌గా మారింది.

గత నెలలో 'జెమిని 3 ప్రో'ను తీసుకొచ్చిన గూగుల్, డిసెంబర్ 17న 'జెమిని 3 ఫ్లాష్'ను రంగంలోకి దించింది. "వేగం, స్కేలబిలిటీ కోసం మేధస్సును పణంగా పెట్టాల్సిన అవసరం లేదని జెమిని 3 ఫ్లాష్ నిరూపిస్తోంది" అని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో గర్వంగా ప్రకటించింది.

సాధారణంగా జెమిని యాప్ వాడుతున్న ఉచిత వినియోగదారులు పరిమితమైన ప్రశ్నలను 'థిం...