భారతదేశం, నవంబర్ 24 -- గూగుల్ మ్యాప్స్ తమ యూజర్ల కోసం మరో నాలుగు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. రోజువారీ ప్రయాణాలు, పండగ సీజన్‌లో ట్రిప్పులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు. ఈ కొత్త అప్‌డేట్స్‌లో జెమినీ ఏఐ ఇంటిగ్రేషన్, మెరుగైన ఈవీ ఛార్జర్ లొకేటర్, రిఫ్రెష్ చేసిన ఎక్స్‌ప్లోరర్ ట్యాబ్, అలాగే స్థానిక వ్యాపారాలకు కొత్త రివ్యూ ఆప్షన్లు వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటే, మరికొన్ని రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో విడుదల కానున్నాయి.

జెమినీని ఉపయోగించి రెస్టారెంట్లు, హోటళ్లు, వేదికలు, ఇతర ప్రాంతాల గురించి వివరాలు తెలుసుకోవడానికి గూగుల్​ మ్యాప్స్ ఇప్పుడు యూజర్లకు సహాయం చేస్తుంది. ఆన్‌లైన్ రివ్యూలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా "వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన" సూచనలను ఈ టూల్ అందిస్తుంది.

ఆ ప్రాంత...