భారతదేశం, నవంబర్ 26 -- బుధవారం రోజు ప్రముఖ ఆన్‌లైన్ వీడియో కాలింగ్, మీటింగ్ ప్లాట్‌ఫామ్ గూగుల్ మీట్ (Google Meet) సేవలకు భారతదేశంలో పెద్ద అంతరాయం ఏర్పడింది. చాలా మంది యూజర్లు తమ ఆన్‌లైన్ మీటింగ్‌లలో చేరలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అంతరాయాలను పర్యవేక్షించే వేదిక అయిన డౌన్‌డెటెక్టర్ (Downdetector) ప్రకారం, మధ్యాహ్నం 12:29 గంటల వరకు కనీసం 1,760 మంది భారతీయులు గూగుల్ మీట్‌లో సమస్యలను నివేదించారు. వెబ్‌సైట్ ద్వారా గూగుల్ మీట్ మీటింగ్‌లలో చేరడానికి ప్రయత్నించిన చాలా మంది యూజర్లకు ఈ సమస్య ఎదురైంది.

మీటింగ్స్‌లో చేరేందుకు ప్రయత్నించిన యూజర్లకు స్క్రీన్‌పై ఒక ఎర్రర్ మెసేజ్ కనిపించింది. "502. దట్ ఈజ్ ఆన్ ఎర్రర్. సర్వర్ తాత్కాలిక లోపాన్ని ఎదుర్కొంది. మీ అభ్యర్థనను పూర్తి చేయలేకపోయాము. దయచేసి 30 సెకన్లలో మళ్లీ ప్రయత్నించండి" అనే సందేశం కనిపించింది....