భారతదేశం, ఏప్రిల్ 30 -- గూగుల్ ప్లే స్టోర్ లో భారీ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. యాప్ ఫిగర్స్ డేటా ప్రకారం.. 2024 ప్రారంభంలో గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్ ల సంఖ్య 3.4 మిలియన్లు కాగా, ప్రస్తుతం 1.8 మిలియన్లకు పడిపోయింది. అంటే కొన్ని నెలల్లోనే దాదాపు సగం పైగా యాప్స్ ను గూగుల్ తొలగించింది. మరోవైపు, అదే సమయంలో ఆపిల్ యాప్ స్టోర్ లోని యాప్ ల సంఖ్య 1.6 మిలియన్ల నుంచి 1.64 మిలియన్లకు పెరిగింది.

గతంలో ప్లే స్టోర్ లో గూగుల్ ఏ యాప్ నైనా అనుమతించేది. కానీ 2024 జూలైలో అది మారిపోయింది. ఫంక్షనింగ్ సరిగ్గా లేని యాప్స్ ను తొలగించే ఉద్దేశంతో కంపెనీ కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది, అవి, సింగిల్ వాల్ పేపర్ యాప్స్, టెక్స్ట్-ఓన్లీ యాప్స్, ఏ యాక్టివిటీ లేని యాప్స్ మొదలైన వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించడం ప్రారంభించింది. అంటే, ఇప్పుడు వినియోగదారులకు నిజమైన సేవ...