భారతదేశం, ఆగస్టు 21 -- గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్లలో కంపెనీకి చెందిన టెన్సర్ జీ5 చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌లు ఉన్నాయి. ఇవి ఇన్‌బిల్ట్ క్యూఐ2 ఛార్జింగ్ మాగ్నెట్‌లను కలిగి ఉన్నాయి. పిక్సెల్ స్నాప్ మాగ్నెటిక్ ఛార్జింగ్ యాక్ససరీలకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఫోన్లు ఆగస్టు 28 నుంచి గూగుల్ స్టోర్, రిటైల్ పార్ట్‌నర్స్ స్టోర్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ ఫోన్లు గురించి తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 10.. 6.3-అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ (హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 2,000 నిట్స్) కలిగి ఉంది. పిక్సెల్ 10 ప్రో లాగానే, ఇది కూడా అదే సైజు ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది, కానీ పిక్సెల్ 10 రిఫ్రెష్ రేట్ 60Hz నుండి 120Hz వరకు పరిమితం చేశారు. అయితే ప్...