భారతదేశం, నవంబర్ 21 -- టెక్నాలజీ రంగంలో గూగుల్ మరో మైలురాయిని అధిగమించింది. అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలతో కూడిన సరికొత్త మోడల్, 'నానో బనానా ప్రో'ను (Nano Banana Pro) గూగుల్ తాజాగా ఆవిష్కరించింది.

గతంలో జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ మోడల్ ఆధారంగా వచ్చిన 'నానో బనానా' టూల్, రెట్రో, పండుగలు, బాలీవుడ్ తరహా ఇమేజ్‌లను జనరేట్ చేసి సోషల్ మీడియాలో బాగా ట్రెండీగా మారింది. ఇప్పుడు, ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ 'నానో బనానా ప్రో', గూగుల్ అత్యంత శక్తివంతమైన 'జెమిని 3 ప్రో' AI మోడల్‌పై రూపొందింది.

దీని ద్వారా మరింత నాణ్యమైన విజువల్స్, వేగవంతమైన రెండరింగ్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది క్రియేటర్లకు, అలాగే సాధారణ యూజర్లకు మరింత పవర్‌ఫుల్ ఇమేజ్ జనరేషన్ టూల్‌గా మారే అవకాశం ఉంది.

నానో బనానా ప్రో గురించి తప్పకుండా తె...