భారతదేశం, ఆగస్టు 22 -- గూగుల్ సంస్థ ఇటీవలే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ పిక్సెల్ 10 5జీని అధికారికంగా విడుదల చేసింది. ఇది ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అయితే మార్కెట్లో చాలా మంది ఇంకా యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఫోన్‌ను కొనాలనే గందరగోళంలో ఉన్నవారి కోసమే ఇది!. గూగుల్ పిక్సెల్ 10, ఐఫోన్ 17 (అంచనా) స్పెసిఫికేషన్స్‌ను పోల్చి చూసి, ఏది కొంటే లాభమో తెలుసుకుందాము..

ఐఫోన్ 17: ఐఫోన్ 17 అధికారికంగా ఇంకా విడుదల కానప్పటికీ, లీకైన సమాచారం ప్రకారం దీని డిజైన్ మునుపటి మోడల్స్ లాగే ఉండవచ్చు. అయితే ఇది 7.2 ఎంఎం మందం, 162 గ్రాముల బరువుతో మరింత సన్నగా, తేలికగా ఉండే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ 10: దీని డిజైన్ కూడా మునుపటి మోడల్స్‌ను పోలి ఉంటుంది. కానీ ఐఫోన్ 17తో పోలిస్తే ఇది కాస్త బరువుగా, మందంగా ఉ...