భారతదేశం, డిసెంబర్ 23 -- కెరీర్ విషయంలో అయోమయంలో ఉన్నారా? ఏ ఉద్యోగం మీకు సెట్ అవుతుందో తెలియక సతమతమవుతున్నారా? అయితే మీకోసం గూగుల్ ఒక అద్భుతమైన వార్తను తీసుకొచ్చింది! విద్యార్థులు, కెరీర్ ప్రారంభంలో ఉన్నవారు, అలాగే చేస్తున్న వృత్తిని మార్చుకోవాలనుకునే వారి కోసం 'కెరీర్ డ్రీమర్' అనే సరికొత్త ఆన్‌లైన్ టూల్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమ ప్రొఫెషనల్ లైఫ్ గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది దిశానిర్దేశం చేస్తుంది!

ఈ గూగుల్​ కొత్త ప్లాట్‌ఫారమ్ యూజర్లను ఒక క్రమపద్ధతిలో గైడ్ చేస్తుంది. మీరు ప్రస్తుతం చేస్తున్న పని ఏంటి? గతంలో ఎక్కడ పనిచేశారు? వంటి వివరాలను అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా, మీరు చేసిన పనులు, మీకున్న నైపుణ్యాలను ఈ టూల్ విశ్లేషిస్తుంది.

అనంతరం, మీ బలాబలాలు, ఎక్స్​పీరియెన్స్​ని క్రోడీకరిస్తూ ఒక 'కెరీర్ ఐడెంట...