భారతదేశం, డిసెంబర్ 6 -- వివరంగా ఆలోచించి, సంక్లిష్ట సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించడం వంటి పనులపై దృష్టి సారించే సరికొత్త ఫీచర్‌ని గూగుల్ సంస్థ జెమినీ యాప్‌లో ప్రవేశపెట్టింది. 'జెమినీ 3 డీప్ థింక్' పేరుతో ఈ ఫీచర్​ని విడుదల చేసింది. అల్ట్రా ప్లాన్​ కలిగి ఉన్న యూజర్లు వెంటనే దీన్ని ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా చాలా మంది ఏఐని ఫాస్ట్​ రిప్లై కోసం వాడుతుంటారు. అయితే, త్వరగా సమాధానాలు అవసరం లేని, బదులుగా పరిశీలనతో కూడిన లోతైన విశ్లేషణ అవసరమయ్యే సందర్భాల కోసం ఈ ఫీచర్​ని గూగుల్​ రూపొందించింది.

గూగుల్ స్ట్రక్చర్డ్​ రీజనింగ్​తో కూడిన మునుపటి పనుల​ ఆధారంగా ఈ డీప్ థింక్​ని నిర్మించారు. ఇది వేగవంతమైన సమాధానం ఇవ్వడానికి బదులుగా, ఒకేసారి అనేక రీజనింగ్​ మార్గాలను నడుపుతుంది. ఒక ప్రశ్నలో అనేక షరతులు ఉన్నప్పుడు లేదా జవాబును.. వివిధ ఆప్షన్స్​ని పరిశీలించిన త...