భారతదేశం, జూలై 24 -- రష్యా జాతీయురాలు నీనా కుటినా బహిష్కరణపై కర్ణాటక హైకోర్టు బుధవారం తాత్కాలికంగా స్టే విధించింది. గోకర్ణలోని రామతీర్థ కొండ వద్ద ఉన్న గుహలో నీనా అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ఈ కేసును జస్టిస్ ఎస్ సునీల్ దత్ యాదవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ విచారించింది. నినా కుటినాను భారత్ నుంచి బలవంతంగా బహిష్కరించడం వల్ల ఆమె కుమార్తెల భద్రత, సంక్షేమానికి విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు.

నీనా తరఫున న్యాయవాది బీనా పిళ్లై వాదనలు వినిపిస్తూ.. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒప్పందాన్ని (యూఎన్‌సీఆర్సీ) ఉటంకిస్తూ బహిష్కరణ ప్రక్రియ పిల్లల ప్రయోజనాలను విస్మరిస్తోందని వాదించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఏ నిర్ణయం తీసుకున్నా పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలన్నారు.

యూఎన్‌సీఆర్సీ ఆర్టికల్ 3 ప్రకారం, 'పిల్లలను ప...