భారతదేశం, ఆగస్టు 5 -- రెండేళ్ల క్రితం వరకు తిరుగులేని శక్తిగా వెలుగొందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఇప్పుడు ఇంటాబయటా పెనుసవాళ్లను ఎదుర్కొంటోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అంతర్గత కలహాలు, పార్టీ నాయకత్వం ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం వంటి పరిణామాలు బీఆర్‌ఎస్‌ బలహీనపడుతుందనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పార్టీ హార్డ్‌కోర్ కార్యకర్తలు, అభిమానులను కలవరపెడుతున్నాయి.

బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఆ పార్టీకి పెను శాపంగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని పేర్కొనడం కేసీఆర్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్...