Hyderabad, జూలై 7 -- వేదవ్యాసుడు మహాభారతం, శ్రీమద్భాగవతం, 18 పురాణాలను రచించారు. వేద వ్యాసుడు పూర్ణిమి నాడు జన్మించారు. ప్రపంచంలోనే ఆయనను మొదటి గురువుగా భావిస్తారు. ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. గురు పౌర్ణమి పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటాము. దీనిని వ్యాస పౌర్ణమి, వేదవ్యాస జయంతి అని కూడా అంటారు.

గురు పౌర్ణమి నాడు గురువులను ఆరాధించడం చాలా మంచిది. అదే విధంగా, గురు పౌర్ణమి నాడు పుణ్య నదుల్లో స్నానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. గురువులకు కానుకలు ఇవ్వడం, దానధర్మాలు చేయడం కూడా శుభప్రదం.

గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అని చాలా మంది సందేహంలో పడ్డారు. గురు పౌర్ణమి తేదీ గురించి, పూజ సమయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి రెండు రోజులు ఉండడం వలన కాస్త తేదీ విషయంలో సందేహం ఉంది. అయితే, గురు పౌర్ణమి జూల...