Hyderabad, జూలై 10 -- ఈరోజు గురు పౌర్ణమి. సూర్యుడు, గురువు కలిసి మిధున రాశిలో గురు ఆదిత్య రాజయోగంను ఏర్పరుస్తున్నారు. అలాగే చంద్రుడు పై గురువు దృష్టి గజకేసరి రాజయోగంను ఏర్పరిస్తోంది. ఇది కాకుండా, శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో ఉన్న కారణంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనితో పాటు ఇంద్రయోగం కూడా ఉంది.

ఈ శుభయోగాలు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి, కానీ ఐదు రాశుల వారికి మాత్రం సానుకూల ప్రభావం పడుతుంది. గురు పౌర్ణమి ఏ రాశుల వరకు కలిసి రాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి గురు పౌర్ణమి సందర్భంగా అదృష్టం కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. ఈ రాశి వారి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. సక్సెస్‌ను అందుకుంటారు.

మిధున రాశి వారికి కూడా గురు పౌర్ణమి కలిసి వస్తుంది. ఈర...