Hyderabad, జూలై 16 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. గ్రహాల మార్పు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు శుభయోగాలను, అశుభయోగాలను కూడా తీసుకువస్తూ ఉంటాయి. త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. గురువు-చంద్రుని కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది.

జూలై 22 ఉదయం 8:14కు చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉండడం వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారికి మాత్రం మంచి జరుగుతుంది. ఈ గజకేసరి రాజయోగంతో ఈ రాశులకే బోలెడు లాభాలు.

గజకేసరి రాజయోగం మిథున రాశిలో ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా లాభాలు పొందుతారు. విద...