Hyderabad, జూలై 14 -- గురువు, చంద్రుని కలయికతో ఏర్పడే శుభయోగం గజకేసరి యోగం. మనసు, తల్లికి సంకేతమైన చంద్రుని సంచారం మిధున రాశిలో జూలై 22వ తేదీ ఉదయం 8:14 గంటలకు చోటు చేసుకోనుంది. జ్ఞానాన్ని సూచించే గురువు ఇప్పటికే మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే, గురువు-చంద్రుడి కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది.

ఇది కొన్ని రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుంది. కెరియర్ లో సక్సెస్ ను అందిస్తాయి, వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. మరి గజకేసరి రాజయోగం వలన ఏయే రాశులు వారు లాభాలు పొందుతారు, ఎవరికి ఎలా కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి వారికి గజకేసరి రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో బోలెడు లాభాలను పొందుతారు. కెరీర్ లో కూడా సక్సెస్ అందుకుంటారు. ఎప్పటినుంచి పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తయిపోతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొంద...