భారతదేశం, నవంబర్ 12 -- మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల అగ్రికల్చర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నవంబర్ 14న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టుగా ప్రకటన విడుదలైంది. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని వివిధ వ్యవసాయ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి B.Sc (ఆనర్స్) వ్యవసాయ కోర్సులో ప్రవేశలకు కౌన్సెలింగ్ జరగనుంది. అభ్యర్థులకు వారి TG EAPCET-2025 ర్యాంకుల ఆధారంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(PJTAU) క్యాంపస్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ జరుగుతుంది.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు పుట్టిన తేదీకి సంబంధించిన రుజువును చూపించే ఎస్ఎస్‌సీ మార్కు...