Hyderabad, మే 21 -- బాదం పప్పులు సూపర్ ఫుడ్. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. బాదంలో ప్రోటీన్ తో పాటూ ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె, మెదడు, ఎముకలు, జీర్ణక్రియ, చర్మానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. బాదం పప్పుల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. బాదంను చర్మ సంరక్షణలో భాగం చేసుకోవచ్చు. బాదం పప్పుతో చేసిన ఫేస్ ప్యాక్ ను వేసుకుని చర్మాన్ని మెరిపించుకోవచ్చు.

ఓట్స్ పొడి - ఒక స్పూను

బాదం పప్పులు - మూడు

పచ్చి పాలు - రెండు స్పూన్లు

ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ముందుగానే బాదం పప్పును నీటిలో నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, బాదం పప్పు పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. అందులో పచ్చి పాలు వేసి కలుపుకోవాలి. ఈ ప్...