Hyderabad, జూన్ 14 -- బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో స్మాల్ స్క్రీన్‌కు చెందిన నటుడు మరణించడం ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖ సినీ, టీవీ నటులు అల్లం గోపాలరావు ఇవాళ (జూన్ 13) కన్నుమూశారు.

బుల్లితెరపై మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అల్లం గోపాలరావు అనారోగ్యం కారణంగా ఇవాళ శనివారం ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో మృతి చెందారు. దీంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గోపాలరావు మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

ఆయన నివాసంలో ఉన్న అల్లం గోపాలరావు భౌతిక కాయాన్ని సందర్శించి ప్రముఖులు హాజరవుతూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గొప్పదనం గురించి చెబుతున్నారు. ఇదిలా ఉంటే, 75 సంవత్సరాలు ఉన్న అల్లం గోపాలరావుకు భార్య వి...