Hyderabad, ఏప్రిల్ 16 -- గుప్పెడంత మనసు.. స్టార్ మాలో వచ్చిన టాప్ సీరియల్స్ లో ఇదీ ఒకటి. సుమారు నాలుగేళ్ల పాటు ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను అలరించింది. గతేడాది ఆగస్ట్ లో ముగిసింది. అయితే ఇందులో ప్రధాన పాత్రలైన రిషి, వసుధార పాత్రల్లో నటించిన ముకేశ్ గౌడ, రక్ష గౌడ కలిసి మరో సీరియల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రిషి, వసుధార కలిసి మరో సీరియల్లో నటిస్తున్నారని, ఆ సీరియల్ కూడా స్టార్ మాలోనే రానుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది గుప్పెడంత మనసు సీరియల్ కు సీక్వెల్ అని, దీని పేరు నిండు మనసులు అని కూడా అన్నారు. అయితే ఈ సీరియల్ ప్రోమో రిలీజైన తర్వాత అదంతా ఉత్తదే అని తేలిపోయింది.

అసలు అది గుప్పెడంత మనసు సీరియల్ కు కొనసాగింపు కాదని, అందులో ముకేశ్, రక్ష నటించడం లేదని తేలిపోయింది. దీంతో ఈ జంట అభిమానులు మరింత నిరాశకు గుర...