Hyderabad, సెప్టెంబర్ 25 -- పవన్ కల్యాణ్ ఓజీ మూవీ మేనియా తెలుగు రాష్ట్రాల్లోని అతని అభిమానులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా పట్టుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి జ్యోతి పూర్వజ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ గురువారం (సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఒక రోజు ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా పవన్ అభిమానులకు ఈ ఓజీ మేనియా పట్టుకుంది. కన్నడ నటి అయిన జ్యోతి పూర్వజ్ కూడా ఇలా ఓజీ అభిమానిగా మారిపోయి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫొటోలు అప్‌లోడ్ చేసింది.

జీన్స్ పై ఓ వైట్ ఓజీ టీషర్ట్ వేసుకొని ఫొటోలకు పోజులిచ్చింది. క్యాప్షన్ గా ఓజీ, పవన్ కల్యాణ్, దే కాల్ హిమ్ ఓజీ హ్యాష్‌ట్యాగ్స్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసి ఫ్...