Hyderabad, ఏప్రిల్ 17 -- గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు త్యాగానికి జ్ఞాపకంగా నిర్వహించుకునే ప్రత్యేక దినోత్సవం. క్రైస్తవ మత ప్రజలకు ఇది ఎంతో ముఖ్యమైన రోజు. అలాగని వారు ఈ రోజున సంతోషంగా ఉండరు. చర్చిల్లో ప్రార్థనలు చేసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఒకరినొకరు ఓదార్చుకుంటారు. తమ ప్రభువైన యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు.

ప్రతి ఏడాది గుడ్ ఫ్రైడే రోజు బాధాతప్త హృదయాలతో ఉంటారు క్రైస్తవ సోదరులు. దీని వెనుక ముఖ్యమైన కారణం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే వచ్చింది. దీని ప్రాముఖ్యత చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

బైబిల్ చెబుతున్న ప్రకారం రోమన్ గవర్నర్ పొంటియస్ పిలాతు ఆదేశం మేరకు యేసుక్రీస్తును శిలువ వేశారు. అతనిపై రాజ ద్రోహం, దైవ దూషణ వంటి అభియోగాలను మోపారు. అతనికి శిలువ వేసిన రోజు శుక్రవారం. దీన్నే గుడ్ ఫ్రైడే అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. తమ ప్ర...