Hyderabad, ఏప్రిల్ 18 -- ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు మొదలైపోయాయి. యేసును శిలువ వేసినందుకు బాధతో క్రైస్తవ సోదరులంతా నలుపు దుస్తులు ధరించి గుడ్ ఫ్రైడేను సంతాపదినంగా నిర్వహించుకుంటారు.

గుడ్ ఫ్రైడే ఎప్పుడు నిర్వహించుకోవాలి అన్నది చంద్రమాన క్యాలెండర్ పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఏడాది మార్చి 20 నుంచి ఏప్రిల్ 23 మధ్య ఎక్కువగా గుడ్ ఫ్రైడే పండుగ వస్తూ ఉంటుంది. గుడ్ ఫ్రైడే రోజే యేసును శిలువ వేశారు రోమన్ పాలకులు.

ప్రజలు చేసిన పాపాలకు తనను తానే యేసు బలి ఇచ్చుకున్నాడని చెప్పుకుంటారు క్రైస్తవ సోదరులు. గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ ఇచ్చాము.

1. గుడ్ ఫ్రైడే కి దాదాపు 40 రోజులు ముందు నుంచి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ఆచారాలను మొదలుపెడతారు. ఉపవాసాలు చేయడం ప్రారంభిస్తారు.

2. గుడ్ ఫ్రైడే నాడు యేసుక్రీస్తు పలికిన ఏడ...