Hyderabad, జూన్ 11 -- ఇండియన్ ఓటీటీలో అత్యుత్తమ వెబ్ సిరీస్ లలో ఒకటి పంచాయత్ (Panchayat). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ ఈ నెలలోనే వచ్చేస్తోంది. మొదట జులై 2 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించిన ప్రైమ్ వీడియో.. ప్రేక్షకుల వేసిన ఓట్ల మేరకు వారం ముందుగానే తీసుకురానుండటం విశేషం.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పంచాయత్' సీజన్ 4 అమెజాన్ ప్రైమ్ వీడియోలో తిరిగి రాబోతోంది. ఈ కొత్త సీజన్ లో మంజు దేవి (నీనా గుప్తా), క్రాంతి దేవి (సునీత రాజ్వర్) మధ్య ఎన్నికల పోరు జరగబోతోంది. ఈ సరికొత్త సీజన్ జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రైమ్ వీడియో తెలిపింది. కొత్త స్ట్రీమింగ్ తేదీతోపాటు ట్రైలర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

కొన్ని రోజుల కిందట తమకు ఓటు వేస్తే సీజన్ 4ను జులై 2 కంటే ముందే తీసుకొస్తామని మంజు దేవి...