భారతదేశం, జనవరి 6 -- ఈ మధ్య తెలుగులో ఏ పెద్ద హీరో సినిమా రిలీజైనా టికెట్ల ధర పెంపు కామనైపోయింది. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ మేకర్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. టికెట్ల ధరలను పెంచకూడదని నిర్ణయించడం విశేషం.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు, అందులోనూ సంక్రాంతి సీజన్ అంటే టికెట్ రేట్లు పెంచడం కామన్. కానీ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా విషయంలో నిర్మాతలు (సాహు గారపాటి, సుష్మిత కొణిదెల) టికెట్ ధరలను పెంచకూడదని నిర్ణయించుకున్నారు.

ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. పండగకి కుటుంబం అంతా కలిసి సినిమా చూడాలంటే టికెట్ రేట్లు భారం కాకూడదని చిరంజీవి భావించారట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు నిర్ణయించిన రెగ్యులర్ ధరలకే (సింగిల్ స్క్రీన్స్ రూ. 150-175 రేంజ్) టికెట్లు అమ్ముతారు. ప్రభాస్ ...