Telangana, జూన్ 25 -- రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మీసేవలో ఇసుక బుకింగ్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఇసుక అవసరం ఉన్న వాళ్లు. నేరుగా మీసేవ కేంద్రాలను సందర్శించవచ్చు. ప్రాథమిక వివరాలతో సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు.

ఈ కొత్త విధానం ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చు. ప్రజలు వారి సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించారు. మొబైల్‌ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఆ తర్వాత ఇతర వివరాలను ఎంట్రీ చేస్తారు. ఏ ప్రాంతానికి ఇసుక కావాలనే వివరాలను స్పష్టంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జిల్లా, మండలం, గ్రామం, ల్యాండ్ మార్క్ తో పాటు పిన్ కోడ్ వివరాలను నమోదు చేయాలి. వీటితో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లిస్తే బుకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.

ఈ ఆన్ లైన్ విధానంలో తమకు కావాల్సిన ఇసుకను నచ్చిన స్టాక్‌యార్డ్‌ నుంచ...