భారతదేశం, మే 6 -- మెగా కుటుంబంలో మరో సంబరం నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో తొలిసారి తల్లిదండ్రులు కానున్నారు. లావణ్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ నేడు (మే 6) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

తాను, లావణ్య ఒకరి చేతిలో చేయి వేసుకొని.. బుజ్జి బూట్లలను వేళ్లతో పట్టుకున్న ఫొటోను వరుణ్ తేజ్ నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. లవ్ సింబల్స్ కూడా పెట్టారు. జీవితంలో అత్యంత అందమైన పాత్ర త్వరలో వచ్చేస్తోంది అని క్యాప్షన్ రాశారు. తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పేశారు. "లైఫ్‍లో అత్యంత బ్యూటిఫుల్ రోల్.. త్వరలో" అని వరుణ్ రాసుకొచ్చారు. స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం 2023 నవంబర్ 1వ తేదీన జరిగింది.

2017లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా మిస్టర్ స...