Hyderabad, ఏప్రిల్ 12 -- హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్లలో ముందుండేది గుడ్లు. వీటిల్లో పుష్కలంగా ప్రొటీన్ ఉండటంతో పాటు పోషకాలు కూడా ఉంటాయి. కానీ, గుడ్లను ఏ రకంగా తీసుకున్నా మంచిదేనని అనుకోకూడదు. ముఖ్యంగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి జరిగే మంచి కంటే చెడే ఎక్కువ. ఇంతేకాకుండా మరికొన్ని విధాలుగా కూడా గుడ్లను తీసుకోవడం ప్రమాదకరమట. మరి గుడ్లను సరైన విధానంలో తినడం ఎలా? ఎన్ని విధాలుగా తినకపోవడం ఉత్తమం?

ప్రొటీన్లతో పాటు పోషకాల అందించడంలో గుడ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. అధిక మొత్తంలో ప్రొటీన్, విటమిన్లు, పోషకాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన రీతిలో గుడ్లను తీసుకోవడం ఎలాగో తెలుసుకుందామా..

గుడ్లను తీసుకుంటే గుండెకు చాలా మంచిది. గుడ్లలో ఉండే ఎమినో యాసిడ్లు ఎక్కువగా ఉండటంతో పాటు విటమిన్ బీ12, డీ, ఏ, ఈ లతో పాటు కొలైన్ కూడా శరీర...