భారతదేశం, జనవరి 2 -- సాధారణంగా మనలో చాలామందికి గుడ్డు అంటే కేవలం ప్రోటీన్ ఇచ్చే ఆహారం మాత్రమే. కానీ, మన వంటింట్లో దొరికే కేవలం రెండు రకాల దినుసులతో గుడ్డును ఒక 'పవర్‌హౌస్' లాగా మార్చవచ్చని చెబుతున్నారు కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ. AIIMS, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో శిక్షణ పొందిన ఆయన.. గుడ్ల ద్వారా గరిష్ట ప్రయోజనాలు ఎలా పొందాలో ఒక ప్రత్యేకమైన రెసిపీని పంచుకున్నారు.

2019లో 'న్యూట్రియెంట్స్' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, గుడ్లలో ప్రోటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్ A, D, E, K, B తో పాటు ఎన్నో రకాల ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే గుడ్లను ఒక 'సూపర్ ఫుడ్'గా పరిగణిస్తారు. అయితే, ఈ పోషకాలను పేగుల ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఎలా మార్చుకోవచ్చో డాక్టర్...