భారతదేశం, జూలై 9 -- గుజరాత్‌లోని మహీసాగర్ నదిపై నిర్మించిన వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటన జరిగే సమయంలో బ్రిడ్జీ మీద నుంచి వెళ్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. వడోదరలోని పద్రా తాలూకాలోని గంభీర-ముజ్‌పూర్ వంతెనలోని ఒక భాగం కూలిపోవడంతో తొమ్మిది మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అనేక వాహనాలు మహిసాగర్ (మహి) నదిలో పడిపోయాయి.

ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే ఈ వంతెన ఉదయం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూలిపోయింది. నివేదికల ప్రకారం రెండు ట్రక్కులు, ఒక బొలెరో ఎస్‌యూవీ, ఒక పికప్ వ్యాన్ సహా నాలుగు వాహనాలు వంతెనను దాటుతుండగా అకస్మాత్తుగా అది కూలిపోయింది. వాహనాలు నదిలోకి పడడానికి కొన్ని క్షణాల ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అగ్నిమాపక దళం బృందాలు, స్థానిక పోలీసులు, వడోదర జిల్లా యంత్రాంగ...