భారతదేశం, డిసెంబర్ 22 -- గుజరాత్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న 'గుజరాత్ కిడ్నీ అండ్​ సూపర్ స్పెషాలిటీ' హాస్పిటల్స్ లిమిటెడ్ తన పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)తో నేడు ఇన్వెస్టర్ల ముందుకు వచ్చింది. డిసెంబర్ 22న ప్రారంభమైన ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ బుధవారం (డిసెంబర్ 24) వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను సంస్థ విస్తరణ, రుణాల చెల్లింపుల కోసం ఉపయోగించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓకు సంబంధించిన ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ఐపీఓ షేరు ధరను రూ. 108 నుంచి రూ. 114 గా నిర్ణయించారు. మొత్తం రూ. 250.80 కోట్ల సమీకరణ లక్ష్యంగా 2.20 కోట్ల కొత్త షేర్లను విక్రయిస్తోంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) లేకపోవడం గమనార్హం.

అంటే ఈ నిధులన్నీ నేరుగా కంపెనీ ఖాతాకే వెళ్తాయి.

లాట్ సైజ్: కనీసం 128 షేర్లకు దరఖాస్తు చేయాలి. అంటే రిటైల్ ఇన్వెస్టర్లు కనీ...