భారతదేశం, మే 23 -- గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ శ్లాబ్ పెచ్చులు ఊడి పడి పదేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. అమృత్ భారత్ పేరుతో దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరిస్తున్న సమయంలో గుంతకల్లు జంక్షన్‌లో జరిగిన ఘోరం అందరిని కలిచి వేసింది.
గుంతకల్లుకు చెందిన కుటుంబం రామేశ్వరం వెళ్లేందుకు బుధవారం రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. 7వ నంబర్ ప్లాట్‌ఫాంపై రైలు కోసం ఎదురు చూస్తున్నారు. రైల్వే స్టేషన్ భవనం శ్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో పదేళ్ల బాలుడు మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తెచ్చారు. అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.